![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చాక మంచి ఫేమ్ సంపాదించిన ఆదిరెడ్డి నరేంద్ర మోడీ గురించి ఎన్నో కామెంట్స్ చేసాడు. "నరేంద్ర మోడీ గారూ మీరు ఈ దేశానికి దేవుడిచ్చిన వరం.. ఈ దేశానికి మీరు చేయగలిగినంత చేశారు... ఇప్పటి వరకు నేను మీకు వీరాభిమానిని కాదు, బీజేపీకి ఇంతవరకు ఓటు కూడా వేయలేదు, మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బాధగా ఉంది ఐనప్పటికీ మీ సాహసోపేతమైన నిర్ణయాల వలన మీపై నాకు చాలా గౌరవం పెరిగింది..చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు కానీ భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది...
రామ మందిరంలో స్వామి వారి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సమయంలో నేను మిమ్మల్ని టీవీలో చూసినప్పుడల్లా నాకు గూస్‌బంప్స్‌ను వచ్చాయి.." అంటూ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు.. అలాగే రీసెంట్ గా రామ మందిర నిర్మాణం కోసం ఒక లక్ష రూపాయలు కూడా డొనేషన్ గా ఇచ్చాడు. అలాగే రామ భక్తులు ఎవరైనా సరే డొనేషన్ ఇవ్వాలనుకుంటే జాగ్రత్తగా చూసి ఇవ్వండి..రాముడి ప్రసాదం పేరుతో కొన్ని ఫేక్ సైట్స్ ఉన్నాయి వాటిని నమ్మొద్దు అంటూ కూడా అందరినీ అలెర్ట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో మెసేజ్ పెట్టాడు. బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ ఐన ఆదిరెడ్డి అదే ఫేమ్‌తో బిగ్ బాస్ సీజన్ 6లో చోటు సంపాదించి టాప్ 4 లో నిలిచాడు. సీజన్ 7 విషయంలో ఆదిరెడ్డి రివ్యూలు చెప్పే మిగతా అందర్నీ డామినేట్ చేశాడు. ఆదిరెడ్డి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ గురించి ఆసక్తికర విషయాలు, లాజిక్స్ చెప్పడంతో అతనికి సుబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు. అలాగే నచ్చని వాళ్ళు ఆదిరెడ్డిని పెయిర్ రివ్యూవర్ అని కూడా అంటూ ఉంటారు. అయినా ఏది అనిపిస్తే అది నెల్లూరు యాసలో చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు ఆదిరెడ్డి.
![]() |
![]() |